భారీ ధరకు అమ్ముడైన “ఘని” ఆడియో రైట్స్!

Published on Jul 6, 2021 10:51 pm IST

భిన్న కథాంశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో వరుణ్ తేజ్. అయితే మొదటి సారిగా వరుణ్ తేజ్ ఘని చిత్రం లో బాక్సర్ గా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే విడుదల అయిన వరుణ్ తేజ్ పోస్టర్లు చిత్రం పై భారీ అంచనాలు పెరిగేలా చేశాయి. అయితే ఈ చిత్రం యొక్క డిజిటల్ మరియు శాటిలైట్ ధరలను ఇప్పటికే ఆహా వీడియో 24 కోట్ల రూపాయలకు దక్కించుకుంది.

అయితే తాజాగా ఈ చిత్రం ఆడయో రైట్స్ ను లహరి మ్యూజిక్ 1.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఘని చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం లో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రానికి కిరణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :