లక్ష్మి బాంబ్ షూటింగ్ మొదలైయింది !

Published on Apr 28, 2019 3:21 pm IST

ముని సిరీస్ లో భాగంగా తెరకెక్కిన రెండవ చిత్రం కాంచన తెలుగు తో పాటు తమిళంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. రాఘవ లారెన్స్ నటించి డైరెక్ట్ చేసిన ఈచిత్రం హారర్ చిత్రాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇక ఈచిత్రాన్నిఇప్పుడు లారెన్స్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ , కియరా అద్వానీ జంటగా నటిస్తున్న ఈచిత్రానికి లక్ష్మి బాంబ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈరోజు ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రారంభమైంది.

ఇక ముని సిరీస్ లో నాలుగవ చిత్రంగా వచ్చిన కాంచన 3 ఇటీవల విడుదలై తెలుగు ,తమిళంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం 100కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

సంబంధిత సమాచారం :