పెద్ద మనసు చాటుకున్న మంచు లక్ష్మీ !

Published on May 22, 2021 5:00 pm IST

కరోనా సోకి వైద్యం కోసం సిటీకి వచ్చి ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. వీరిలో స‌కాలంలో వైద్య స‌దుపాయం అంద‌క చాలా మంది ప్రాణాల‌ను కోల్పోతున్న వారు కూడా ఉన్నారు. దాంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నారు. అయితే ఆ కుటుంబాలకు సాయాన్ని అందిస్తూ తన పెద్ద మనసును చాటుకున్నారు మంచు లక్ష్మీ. మంచు లక్ష్మీ ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలియజేస్తూ ‘అందరికీ నమస్కారం. ఈ కరోనా కష్ట కాలంలో నేను వ్య‌క్తిగ‌తంగా హాస్పిట‌ల్స్‌ లో బెడ్స్‌ను ఏర్పాటు చేసి, మందుల‌ను అందించ‌డం లాంటి సేవ కార్యక్రమాల్లో భాగమైయాను.

ఇప్పుడు టీచ్ ఫ‌ర్ చేంజ్ అనే స్వ‌చ్చంద సంస్థ‌తో క‌లిసి మ‌రింత సాయాన్ని అందించడానికి మరింత ప్రయత్నం చేస్తున్నాను. మనకు తెలుసు, ఈ కరోనా చాల కుటుంబాలను నాశనం చేసింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఎంతోమంది బిడ్డలు తమ త‌ల్లిదండ్ర‌లను కోల్పోయారు. అయితే, అందులో వెయ్యి పేద కుటుంబాల‌ను గుర్తించి, ఆ కుటుంబాలలోని పిల్ల‌ల‌కు సరైన విద్య‌, అలాగే మంచి వైద్యంతో పాటు వారి అవసరాలకు కావాల్సిన ఇత‌ర ఆర్ధిక సాయాన్ని కూడా అందించాలని నిర్ణయించుకున్నాం’ అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :