స్కూల్ పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పిన లక్ష్మీ మంచు

Published on Jan 19, 2020 6:01 pm IST

ప్రపంచంలో సుప్రసిద్ధ సంస్థలకు వినియోగదారులతో అనుసంధానించబడేందుకు సాధికారిత కల్పిస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీ పెగా సిస్టమ్స్, ఐఎన్సీ (నాస్ డాక్: పెగా) మరియు ప్రాధమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల భాష విద్యలో శిక్షణ అందించడంతో పాటుగా నాయకత్వ నైపుణ్యం, డిజిటల్ అక్షరాస్యతలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ నేడు సుప్రసిద్ధ నటి, నిర్మాత మరియు టీచ్ ఫర్ ఛేంజ్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ లక్ష్మి మంచును ఒక రోజు పాటు ఆంగ్ల భాషా ఉపాధ్యాయురాలిగా సేవలనందించేందుకు ఆహ్వానించింది. మాదాపూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థులకు ఆంగ్ల భాషను బోధించడంతో పాటుగా నూతన విద్యా సంవత్సరంలో పెగా టీచ్ ఫర్ ఛేంజ్ అక్షరాస్యత కార్యక్రమం కోసం వాలెంటీర్ అప్లికేషన్ లను ఆహ్వానించారు.
దేశవ్యాప్త ఉద్యమం పెగా టీచ్ ఫర్ ఛేంజ్ అక్షరాస్యత కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహితంగా పనిచేయడంతో పాటుగా ప్రాథమిక పాఠశాలల నడుమ అక్షరాస్యత నైపుణ్యం అభివృద్ధి చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిబద్ధత కలిగిన వ్యక్తులు తమ కమ్యూనిటీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బోధన చేయనున్నారు. ఈ వాలెంటీర్లను తమ చుట్టు పక్కల ప్రాంతాలలో నియమించేముందు వారిని పరీక్షించడంతో పాటుగా శిక్షణ కూడా అందిస్తారు. విద్యార్థులు మాట్లాడే, చదివే, వినికిడి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన బోధనా మాడ్యూల్స్ ను ఈ వాలెంటీర్లు బోధిస్తారు. తరగతి గదిలో ఆంగ్ల భాషలో మాట్లాడే వాతావరణం సృష్టించడం ద్వారా విద్యార్థులు ఆ భాషను సులభంగా అభ్యసించేందుకు సహాయపడుతున్నారు.

ప్రతీ వాలెంటీర్, ఒక విద్యా సంవత్సరం తరగతి గది బోధనకు కట్టుబడాల్సి ఉంటుంది. ఈ అకడమిక్ సంవత్సరంలో, ప్రతి చిన్నారి జీవితంలో మార్పును తీసుకువచ్చేందుకు ప్రయత్నించనున్నారు. ఈ అక్షరాస్యత కార్యక్రమం మూడు సంవత్సరాలు (మూడవ తరగతి – ఐదవ తరగతి) పాటు అందుబాటులో ఉంటుంది. ఇవి పిల్లలకు నిర్మాణాత్మక సంవత్సారాలుగా కూడా నిలుస్తాయి.

కోట్స్ మరియు కామెంటరీ: ”లక్ష్మి ఉత్సాహం, అత్యంత రద్దీ షెడ్యూల్ కలిగినప్పటికీ నిరుపేద వర్గాలకు చెందిన చిన్నారుల అభ్యున్నతి అనే మహోన్నత కారణం కోసం తన సమయం కేటాయిస్తూ ఆమె చూపే నిబద్ధత పట్ల మేము ఆశ్చర్యపోతున్నాం. మార్పు అనేది ఎక్కడి నుంచైనా వస్తుందనే దానిని ఇది ప్రతిబింబిస్తుంది. భారతదేశంలో విద్యాభివృద్ధి పరంగా మార్పును తీసుకురావడంతో పాటుగా స్పూర్తి ప్రతీకగా లక్ష్మి నిలుస్తున్నారు. వారికి అవసరమైన నాణ్యమైన విద్యను పొందేందుకు, ఈ విద్యార్థులకు సహాయపడేందుకు మాకు ప్రోత్సాహం అందించనుంది.” అని సుమన్ రెడ్డి, మేనేజింగ్ డైరక్టర్, పెగా సిస్టమ్స్ ఇండియా అన్నారు. ఆయనే మాట్లాడుతూ.. ”ఈ కార్యక్రమం పెగా టీచ్ ఫర్ ఛేంజ్ కింద మద్దుతు అందుకుంటున్న విద్యార్థులందరికీ స్పూర్తి అందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఇది జీవితంలో అత్యుత్తమ అంశాలను అభ్యసించే అవకాశం కల్పిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా ప్రజలు మాతో భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా మన భావి భారత పౌరుల కోసం ఆంగ్ల భాష మరియు డిజిటల్ అక్షరాస్యతను అభివృద్ధి చేయాల్సి ఉంది” అని అన్నారు.

ఈ కార్యక్రమం గురించి చైతన్య ఎంఆర్ఎస్కె, సీఈఓ అండ్ ట్రస్టీ, టీచ్ ఫర్ ఛేంజ్ మాట్లాడుతూ.. ”భారతదేశ వ్యాప్తంగా ప్రభావం చూపడంలో పెగా టీచ్ ఫర్ ఛేంజ్ వాలెంటీర్లు వెన్నెముకగా నిలిచారు. ప్రతి ప్ఱభుత్వ పాఠశాల విద్యార్థి, వారి కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్యను అందుకోవాలన్నది మా ప్రయత్నం. మా వాలెంటీర్స్ ఈ కార్యక్రమానికి అందిస్తున్న అవిశ్రాంతి ప్రయత్నానికి లక్ష్మి మద్దతునందించడం ఆనందంగా ఉంది. ఆమె నిబద్ధత మరియు నేడు ఆమె పంచుకున్నజీవిత కథ, విద్యార్థులను ప్రోత్సహించడమే కాదు, మా బృందాన్ని సైతం ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది” అని అన్నారు.
పెగా సిస్టమ్స్ గురించి: కస్టమర్ ఎంగేజ్మెట్ మరియు కార్యాచరణ సమర్థత కోసం అగ్రగామి సాఫ్ట్ వేర్ సంస్థ పెగా సిస్టమ్స్, ఐఎన్సీ. పెగా యొక్క అనుకూల మరియు క్లౌడ్ కృతి సాఫ్ట్ వేర్ ను యునిఫైడ్ పెగా ప్లాట్ ఫామ్ పై నిర్మించారు. ఇది ప్రజలు వేగంగా వినియోగించేందుకు మరియు సులభంగా విస్తరించేందుకు, వ్యూహాత్మక వ్యాపారావకాశాలను చేరుకునేలా తోడ్పడుతుంది. తమ 35 సంవత్సరాల చరిత్రలో, సీఆర్ఎం, డిజిటల్ ప్రాసెస్ ఆటోమేషన్ (డీపీఏ)లో అవార్డు గెలుచుకున్న సామర్థ్యంను అత్యాధునిక కృత్రిమ మేథస్సు మరియు రోబోటిక్ ఆటోమేషన్ శక్తితో పెగా అందించి, ప్రపంచంలో అగ్రశ్రేణి బ్రాండ్లు విప్లవాత్మక వ్యాపార ఫలితాలు సాధించేందుకు సహాయపడింది.

టీచ్ ఫర్ ఛేంజ్ గురించి చెప్పాలంటే ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అక్షరాస్యతను మెరుగుపరిచేందుకు దేశవ్వాప్తంగా ప్రారంభించిన కార్యక్రమం టీచ్ ఫర్ ఛేంజ్. రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యం చేసుకుని పనిచేస్తున్న ఈ కార్యక్రమం, ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో అక్షరాస్యతను వృద్ధి చేస్తుంది. యునైటెడ్ నేషన్స్ సస్టెయినబల్ డెవలప్ మెంట్ గోల్స్ (గోల్4- నాణ్యమైన విద్య)ను చేరుకోవడాన్ని టీచ్ ఫర్ ఛేంజ్ లక్ష్యం చేసుకుంది. ఈ ఉద్యమంలో భాగంగా పౌరులు తమ సమయం వెచ్చించడంతో పాటుగా తమ చుట్టుపక్కల ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు బోధన చేస్తున్నారు.

ఈ టీచ్ ఫర్ ఛేంజ్ ట్రస్ట్, నాలుగు కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. తద్వారా ప్రతి చిన్నారి తమ కుటుంబ ఆదాయం, సామాజిక హోదాలతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్య పొందుతున్నాడన్న భరోసా కల్పిస్తుంది. నిరుపేద మరియు అత్యంత అపాయకరమైన కమ్యూనిటీలలోని చిన్నారులకు విద్యనందించడం ద్వారా భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం లక్ష్యంగా చేసుకుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి అప్లికేషన్ లను ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కోయంబత్తూరు, విజయవాడ, విశాఖపట్నంలలో పెగా టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమం తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గానూ ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు బోధన చేయాలనే ఆసక్తి కలిగిన వాలెంటీర్ల నుంచి అప్లికేషన్లను ఆహ్వానిస్తుంది.

ఆసక్తి కలిగిన వాలెంటీర్లు www.teachforchange.inను సందర్శించడంతో పాటుగా తమ అప్లికేషన్లను పంపించవచ్చు. స్క్రీనింగ్ సెషన్ లో ఎంపికైన వాలెంటీర్లకు వారం రోజుల పాటు శిక్షణ అందిస్తారు. అనంతరం వారు చిన్నారులతో కలిసి పనిచేయడంతో పాటుగా జూన్ 2020 ప్రారంభించి ఒక సంవత్సరం పాటు వారు బోధన చేయాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన వ్యక్తులు www.teachforchange.in చూడడంతో పాటుగా ప్రోగ్రామ్ కోసం అప్లయ్ చేయవచ్చు లేదా 040 2354 6005 లో సంప్రదించవచ్చు.

సంబంధిత సమాచారం :