ఎట్టకేలకు ఆంధ్రా లో విడుదలకానున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ !

Published on Apr 27, 2019 9:00 pm IST

ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈచిత్రం ఒక్క ఆంధ్రా లో తప్ప మార్చి 22 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై డీసెంట్ హిట్ అనిపించుకుంది. అయితే అప్పడు ఎన్నికలు జరుగనున్నాయి అనే కారణం తో ఈచిత్రాన్ని ఆంద్రప్రదేశ్ లో విడుదలచేయలేదు. ఇక ఇప్పుడు ఎన్నికలు అయిపోవడంతో ఈసినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఇక ఈ చిత్రం ఆంధ్రా లో మే 1న విడుదలకానుంది.

మరి ఈ చిత్రం అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి. కళ్యాణి కోడూరి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాకేష్ రెడ్డి మరియు దీప్తి బాలగిరి సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :