సిద్ధిపేటలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ !

సిద్ధిపేటలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ !

Published on Mar 7, 2019 3:00 AM IST

రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతుంది. మరో మూడు రోజులు షూటింగ్ చేస్తే.. సినిమా పూర్తి అవ్వనుంది. కాగా తాజాగా ఈ చిత్రం షూటింగ్ తెలంగాణలోని సిద్ధిపేటలో జరుగుతొంది.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మార్చి 22వ తేదీన విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీ తేజ్, చంద్ర బాబు నాయుడు పాత్రలో నటిస్తుండగా.. ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో నటించిన ప్రముఖ కన్నడ నటి యజ్ఞ శెట్టి లక్ష్మీ పార్వతి పాత్రలో నటిస్తుంది.

ఇక రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా పేరు చెప్పి సోషల్ మీడియాలో బాగానే హడావుడి చేస్తున్నాడు. వెన్నుపోటు పాటతో మొదలు పెట్టి ఆ తరువాత టీజర్, ట్రైలర్ లతో వివాదాలకు బాగానే పునాది వేశాడు ఆర్జీవీ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు