లక్ష్మీ మంచు మరో టాక్ షోకి రంగం సిద్దం.!

లక్ష్మీ మంచు మరో టాక్ షోకి రంగం సిద్దం.!

Published on May 17, 2015 12:55 PM IST

manchu-lakshmi
డా. మోహన్ బాబు ముద్దుల తనయురాలు మంచు లక్ష్మీ మొదట టీవీ హోస్ట్ గా, ఆ తర్వాత నటిగా, నిర్మాతగా మారి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. మంచు లక్ష్మీ నటించిన ‘దొంగాట’ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇంకా ఈ సినిమా పలు ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శిచబడుతోంది. ఈ సినిమా తర్వాత మంచు లక్ష్మీ మరో టాక్ షో తో మనముందుకు రానుంది. గతంలో ‘లక్ష్మీ టాక్ షో’, ‘ప్రేమతో మీ లక్ష్మీ’ అనే టాక్ షోలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.

లక్ష్మీ మంచు చేయనున్న లేటెస్ట్ టాక్ షో పేరు ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’. ఈ షోని తను చేసిన షోస్ కంటే డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ప్రోగ్రాంకి సంబందించిన షూటింగ్ ని మే 25న మొదలు పెట్టనున్నారు. అలాగే ఓ ప్రముఖ చానల్ లో జూన్ 1 నుంచి ఈ ప్రోగ్రాం ప్రసారం కానుంది. లక్ష్మీ మంచు ఈ షో తో పాటు తన తదుపరి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ అంతా మే 20న జరగనున్న మంచు మనోజ్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు