డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “లంబసింగి”

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “లంబసింగి”

Published on Mar 28, 2024 12:46 PM IST

భరత్ రాజ్, దివి వడ్త్యా, వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్ధన్, అనురాధ, మాధవి, నవీన్‌రాజ్ శంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య ప్రధాన పాత్రల్లో, దర్శకుడు నవీన్ గాంధీ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం లంబసింగి. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ గా ఓటిటి ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అయిపోయింది.

ఈ చిత్రం ఏప్రిల్ 2, 2024 నుండి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఆనంద్ తన్నీరు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతం అందించగా, కె బుజ్జి సినిమాటోగ్రఫీ, కె విజయ్ వర్ధన్ ఎడిటర్ గా వర్క్ చేశారు. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు