ధోనీని రిక్వెస్ట్ చేసిన లతా మంగేష్కర్

Published on Jul 11, 2019 6:17 pm IST

నిన్న న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సెమీ ఫైనల్ ఆటలో ఓడిపోయిన కారణంగా వరల్డ్ కప్ టోర్నీ నుండి భారత్ వైదొలగిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి భారత క్రికెట్ అభిమానుల్ని బాధిస్తుంటే ధోనీ రిటైర్మెంట్ వార్త వారిని ఇంకాస్త వేధిస్తోంది. నిన్న ఆడినదే ధోనీకి చివరి మ్యాచ్ అని, ఇంకొద్ది రోజుల్లో ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తారని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు ఇంకొంత కాలం జట్టులో ఆడాలని ధోనీని విజ్ఞప్తి చేస్తున్నారు.

పలువురు ప్రముఖులు సైతం రిటైర్మెంట్ వద్దని ధోనీకి సూచిస్తున్నారు. వారిలో సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ కూడా ఉన్నారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆమె ధోనీ.. నేను మీ రిటైర్మెంట్ వార్తను విన్నాను. మీరు అలా ఆలోచించవద్దు. దేశానికి మీ ఆట అవసరం ఉంది. మీ మనసులోకి రిటైర్మెంట్ ఆలోచన రానివ్వొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నారు.

సంబంధిత సమాచారం :

X
More