లేటెస్ట్: ఎన్టీఆర్ – నీల్ నుంచి రెండు బ్లాస్టింగ్ అనౌన్సమెంట్స్ వచ్చేసాయి

లేటెస్ట్: ఎన్టీఆర్ – నీల్ నుంచి రెండు బ్లాస్టింగ్ అనౌన్సమెంట్స్ వచ్చేసాయి

Published on Apr 29, 2025 1:22 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తో చేస్తున్న భారీ సినిమా కూడా ఒకటి. ఎన్టీఆర్ కెరీర్లో 31వ సినిమా చేస్తున్న ఈ సినిమాపై గట్టి హైప్ నెలకొంది. ఇక ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఎప్పటికపుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు.

మరి ఇలా లేటెస్ట్ గా మరో ట్రీట్ ని అందిస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. అయితే అనూహ్యంగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్సమెంట్ చేయడమే కాకుండా ఈ సినిమా తాలూకా గ్లింప్స్ పై కూడా క్రేజీ అప్డేట్ ని వారు అందించడం జరిగింది. ఇక ఈ మే 20న తారక్ బర్త్ డే కానుకగా అవైటెడ్ గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు.

ఇక దీనితో పాటుగా ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్ నుంచి షిఫ్ట్ చేసి వచ్చే ఏడాది జూన్ 25న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇలా రెండు బ్లాస్టింగ్ అప్డేట్స్ తారక్ ఫ్యాన్స్ కి వచ్చేసాయి అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు