అవైటెడ్ “ది కేరళ స్టోరీ” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.!

అవైటెడ్ “ది కేరళ స్టోరీ” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Feb 6, 2024 4:30 PM IST

గత ఏడాది వచ్చిన పలు సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో బాలీవుడ్ నుంచి వచ్చిన మరో కాంట్రవర్సియల్ చిత్రం “ది కేరళ స్టోరీ” కూడా ఒకటి, మరి కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా సుదీప్తో సేన్ దర్శకత్వంలో యంగ్ హీరోయిన్స్ అదా శర్మ అలాగే సిద్ధి ఇద్నాని తదితరులు మెయిన్ లీడ్ లో నటించిన ఈ చిత్రం రిలీజ్ అయ్యిన తర్వాత థియేటర్స్ లో కాశ్మీర్ ఫైల్స్ తరహాలోనే చాలా పెద్ద హిట్ అయ్యింది.

అయితే కాశ్మీర్ ఫైల్స్ కూడా కాంట్రవర్సీని రేపినప్పటికీ ఓటిటిలో త్వరగానే వచ్చింది కానీ కేరళ స్టోరీ రావడానికి మాత్రం చాలా ఇబ్బంది నెలకొంది. ఇక ఫైనల్ గా ఎట్టకేలకి ఈ చిత్రం ఓటిటిలో రావడానికి సిద్ధం అయ్యింది. ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ జీ 5 వారు ఈ చిత్రాన్ని ఈ ఫిబ్రవరి 16న తీసుకొస్తున్నట్టుగా ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి ఓటిటిలో వచ్చాక ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు