ఎన్టీఆర్ 30 వ సినిమా పై లేటెస్ట్ బజ్!

Published on Jul 8, 2021 2:41 pm IST

ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ 30 వ చిత్రానికి సంబంధించి తాజాగా ఒక వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం లో ఎన్టీఆర్ కి విలన్ గా ఒక యువ నాయకుడు పాత్ర ఉంటుంది అని తెలుస్తోంది. అయితే ఈ పాత్ర కోసం ఇప్పటికే పలువురు ప్రముఖులను దృష్టిలో ఉంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాత్ర కోసం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇతర భాష కి చెందిన యాక్టర్ ను అయినా తీసుకొవడానికి చిత్ర యూనిట్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఎన్టీఆర్ 30 వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. యువ సుధ ఆర్ట్స్ మరియు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఏప్రిల్ 29, 2022 కి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం లో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. మరొక హీరో గా రామ్ చరణ్ సీతా రామరాజు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :