“విశ్వంభర” విడుదల.. దాదాపు ఈ రేస్ లోనే ఫిక్స్!

“విశ్వంభర” విడుదల.. దాదాపు ఈ రేస్ లోనే ఫిక్స్!

Published on Jun 18, 2026 5:02 PM IST

vishwambhara

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష అలాగే హీరోయిన్ ఆశిక రంగనాథ్ ఇతర హీరోయిన్స్ కాంబినేషన్లో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన అవైటెడ్ భారీ ఫాంటసీ సినిమానే “విశ్వంభర”. అనౌన్స్ చేసిన సమయంలో మంచి హైప్ ని బిల్డ్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు అలా ఆలస్యం అవుతూ వస్తుంది. దీని తర్వాత అనౌన్స్ అయ్యిన మన శంకర వరప్రసాద్ గారు ఆల్రెడీ విడుదల అయ్యి భారీ హిట్ అయ్యింది.

కానీ దీని కంటే ముందు స్టార్ట్ అయ్యిన విశ్వంభర ప్రశ్నార్థకంగా మారింది. కానీ ఇప్పుడు విశ్వంభర విడుదలకి దాదాపు సమయం లాక్ అయినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా థియేటర్స్ లో సందడి చేస్తుంది అని వినిపిస్తోంది. మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ తన 158వ సినిమాని కూడా ఎట్టిపరిస్థితుల్లో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ కావడంతో దీనిని ఈ పండుగ కానుకగా విడుదల చేయాలని డిసైడ్ చేసినట్టు సమాచారం. సో దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు