బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామా చిత్రం “యానిమల్”. బాలీవుడ్ సహా తెలుగు ఆడియెన్స్ కూడా ఈ చిత్రం కోసం మంచి ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ క్రేజీ ప్రమోషన్స్ కూడా ఇపుడు చేస్తున్నారు. మరి ఈ చిత్రం విషయంలో గత కొన్నాళ్ల నుంచి రన్ టైం పట్ల కొన్ని ఊహించని వార్తలే వినిపిస్తూ వస్తున్నాయి.
సినిమా ఈజీగా మూడు గంటలు దాటి ఉందని టాక్ వచ్చింది. అయితే అది కరెక్ట్ గా ఎంత అనేది మాత్రం కన్ఫర్మ్ కాలేదు. రీసెంట్ గానే ఏకంగా 3 గంటల 20 నిమిషాలు అని కూడా అంటున్నారు. అయితే వీటిపై ఇప్పుడు ఓ లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుస్తుంది. సినిమా ఓవర్సీస్ కంటెంట్ గా అయితే 3 గంటల 10 నిమిషాల మేర అందిందట. బహుశా ఇక ఇండియాలో కూడా అంతే ఉండొచ్చని చెప్పాలి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.


