‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడేనా ?

ఇంకొ రెండు నెలల్లో విడుదలకానున్న పెద్ద సినిమాల్లో మహేష్ బాబు యొక్క ‘భరత్ అనే నేను’ కూడ ఒకటి. ఈ చిత్రంపై మహేష్ అభిమానులు, ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సినిమాకు సంబందించిన విశేషాలు, ఆడియో, ప్రీ రిలీజ్ వేడుక లాంటి అప్డేట్స్ ఏవైనా బయటికొస్తాయేమోనని ఎదురుచూస్తున్నారు.

తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్లో ఏప్రిల్ 7న భారీ స్థాయిలో జరుగుతుందని తెలుస్తోంది. అయితే నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ నుండి ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొరటాల శివ దర్శకత్వ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది.