శంకర్, చరణ్ ల బిగ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Jul 31, 2021 9:01 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం”, “ఆచార్య” చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి వీటి తర్వాత కూడా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ దర్శకుడు శంకర్ తో అనౌన్స్ చేసి మరింత హైప్ తీసుకొచ్చాడు. అయితే ఈ చిత్రం పై ఎప్పటికప్పుడు ఆసక్తికర అంశాలే బయటకి వస్తుండగా ఇటీవలే ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఫిక్స్ అయ్యిందని తెలిసింది.

మరి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బజ్ దీనిపై వినిపిస్తుంది. నిజానికి ఈ చిత్రం షూట్ సెప్టెంబర్ లో స్టార్ట్ కావాల్సి ఉన్నా ఈ వచ్చే ఆగష్టు మొదటి వారంలోనే ఫార్మల్ పూజా కార్యక్రమం జరుపుకోనుంది అని తెలుస్తుంది. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక చరణ్ మరియు శంకర్ ల కెరీర్ లో బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :