
ఇటీవల కస్టడీ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన యువ నటుడు అక్కినేని నాగచైతన్య దాని తర్వాత యువ దర్శకుడు చందూ మొండేటి తో కొత్త సినిమా కోసం జతకట్టినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు చేసారు. కాగా వీరిద్దరి హ్యాట్రిక్ మూవీకి తాండేలు అనే టైటిల్ పరిశీలనలో ఉండగా దీనిని గీతా ఆర్ట్స్ భారీ ఎత్తున నిర్మించనుంది.
ఈ మూవీ గత కొన్ని వారాలుగా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది మరియు అక్టోబర్ 2023 నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ క్రేజీ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ సినిమాలో నాగ చైతన్య మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నారాని అంటున్నరు. అలానే ఈ మూవీ రొమాంటిక్ కథగా రూపొందనుండగా దీనిని శ్రీకాకుళం, విశాఖపట్నం, ఆమదాలవలస మరియు గుజరాత్‌లలో చిత్రీకరించదానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ మూవీలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.