నాని బాక్సాఫీస్ “టక్” ఇంకా టఫ్ చెయ్యనున్నాడా.?

Published on Feb 2, 2021 3:00 pm IST

టాలెంటెడ్ హీరో నాచురల్ స్టార్ నాని హీరోగా తన హిట్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కించిన మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “టక్ జగదీష్”. టైటిల్ అనౌన్సమెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా మంచి అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం ఈ ఏప్రిల్ 16న గ్రాండ్ గా విడుదల కానుంది అని మేకర్స్ ఇది వరకే అనౌన్స్ చేసిన తెలిసిందే.

కానీ నాని బహుశా తన సినిమా డేట్ ను మళ్ళీ మారుస్తాడని మేము ఇది వరకు చెప్పినట్టు గానే మేకర్స్ ఈ చిత్రం తాలుకా విడుదల తేదీని మార్చనున్నట్టు స్ట్రాంగ్ బజ్ బయటకొచ్చింది. మరి ఈ లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మరో వారం పోస్ట్ పోన్ చేస్తారట అంటే వచ్చే మార్చ్ 23న ఈ చిత్రం విడుదల కానున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇదే కనుక నిజం అయ్యితే అప్పుడు బాక్సాఫీస్ పోటీ టఫ్ గా ఉండడం ఖాయం అనే చెప్పాలి.

ఎందుకంటే సరిగ్గా అదే రోజున అక్కినేని హీరో నాగ చైతన్య నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “లవ్ స్టోరీ” డేట్ లాక్ చేసుకుంది. మరి ఆ సినిమా కూడా ఇదే డేట్ న ఉంటే నాన బాక్సాఫీస్ టక్ ఖచ్చితంగా టఫ్ గా చేసినట్టే అని చెప్పాలి. మరి దీనిపై మాత్రం అధికారిక క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :