నాని సినిమా కొత్త రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Jul 6, 2021 2:42 pm IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో తన హిట్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ప్లాన్ చేసిన చిత్రం “టక్ జగదీష్” కూడా ఒకటి. మాస్ అండ్ క్లాస్ సహా ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి హైప్ ను సెట్ చేసుకున్న ఈ సినిమా గత ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది.

కానీ కరోనా తీవ్రత మూలాన మళ్ళీ విడుదల వాయిదా పడింది. అయితే మేకర్స్ ఇప్పుడు కరోనా తగ్గుతున్న నేపథ్యంలో మళ్ళీ సినిమా విడుదలపై దృష్టి సారించారు అని తెలిసింది. ప్రమోషన్స్ తో టక్ జగదీష్ విడుదలకు సన్నాహాలు కూడా చేస్తున్నారని టాక్ రాగా ఇప్పుడు మరో ఆసక్తికర బజ్ వినిపిస్తుంది.

బహుశా వచ్చే రెండు వారాల్లోపే ఈ చిత్రం తాలూకా సరికొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారట. మరి అది ఎపుడు కన్ఫర్మ్ అవుతుందో చూడాలి. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :