నాని, శివల సినిమా కుదిరినట్టేనా ?

Published on Nov 29, 2019 10:00 pm IST

ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ అనే సినిమా చేస్తున్న నాని నెక్స్ట్ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్షన్లో చేస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో ‘నిన్నుకోరి’ లాంటి హిట్ సినిమా వచ్చింది. కాబట్టి మరోసారి ఇద్దరూ కలిసి పనిచేస్తారనే వార్తలకు బలం చేకూరింది. తాజా సమాచారం మేరకు వీరి ప్రాజెల్ట్ డిసెంబర్ 1న లాంఛ్ కానుందని తెలుస్తోంది.

ఈ సినిమాను నిర్వాణతో ‘మజిలీ’ చిత్రాన్ని నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలు నిర్మిస్తారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే గతంలో నానితో శివ నిర్వాణ సినిమా అంటూ ఇదే తరహా వార్తలు రాగా శివ స్పందిస్తూ నా సినిమా గురించి నేను అధికారికంగా చెప్పే వరకు ఎలాంటి వార్తలను నమ్మకండి అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. పైగా విజయ్ దేవరకొండతో ఆయన ఎప్పటి నుండో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇంతకీ శివ, నానిల సినిమా ఉందా లేదా అనే సందేహం తలెత్తుతోంది. దీనికి జవాబు దొరకాలంటే నాని లేదా నిర్వాణాల నుండి అధికారిక కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :