పవన్ కళ్యాణ్ ‘ఓజి’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్

Published on May 19, 2023 9:40 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ గ్యాంగ్ స్టర్ డ్రామా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఓజి. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ రోల్ పోషిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ గురించి లేటెస్ట్ గా టాలీవుడ్ లో ఒక న్యూస్ క్రేజీ బజ్ గా వైరల్ అవుతోంది. దాని ప్రకారం ఓజి మూవీని రానున్న డిసెంబర్ రెండవారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎక్కడా బ్రేక్స్ లేకుండా షెడ్యూల్స్ కొనసాగించనున్న యూనిట్, మూవీ రిలీజ్ అనంతరం అందరినీ ఆకట్టుకుని పెద్ద సక్సెస్ అందుకుంటుందని అంటోంది. అయితే ఓజి రిలీజ్ డేట్ న్యూస్ పై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :