అప్పుడు మొదలుపెట్టనున్న ప్రభాస్..?

Published on Jul 2, 2020 7:24 pm IST


ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే అలాగే ఈ చిత్రానికి రాధేశ్యామ్ అనే టైటిల్ కూడా వినిపిస్తుంది. ప్రభాస్ నుంచి వస్తున్న మరో భారీ పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ చిత్రంపై కూడా అంతే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

కానీ ఊహించని విధంగా ఈ సినిమా విషయంలో గత కొన్ని రోజుల నుంచి అలా ఓ సస్పెన్స్ నడుస్తూనే ఉంది ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే దీనిపై గత కొన్ని రోజుల క్రితం గట్టిగా వినిపించిన అది సాధ్యపడలేదు. కానీ ఎప్పుడు ఈ చిత్రంపై మరో బజ్ వినిపిస్తుంది.

ఈ చిత్రంలో మిగిలివున్న షూటింగ్ టాకీ పార్ట్ ను ఈ జూలై చివరి వారంలో మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం కోసం వేసిన స్పెషల్ సెట్స్ లో తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.అన్ని తగు జాగ్రత్తలు తీసుకొని టీం షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు వినికిడి, మరి ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

సంబంధిత సమాచారం :

More