“పుష్ప 2” పై కూడా లేటెస్ట్ బజ్.!

Published on May 11, 2021 2:01 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఇక ఇదిలా ఉండగా ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం నుంచి ఇటీవలే ఓ క్రేజీ రూమర్ బయటకు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఈ చిత్రాన్ని ఒక పార్ట్ గా కాకుండా రెండు భాగాలుగా తీస్తున్నారని తెలియడంతో దీనిపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

అయితే ఇప్పుడు ఈ రెండో పార్ట్ కి సంబంధించే లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రం షూట్ వచ్చే ఏడాదిలో మొదలు కానుందట. అలాగే ఆల్రెడీ బన్నీ ఆ సినిమా కోసం కూడా కాల్షీట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవి సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :