లేటెస్ట్..”రాధే శ్యామ్” రిలీజ్ డేట్ పై సరికొత్త బజ్.!

Published on Jul 27, 2021 3:42 pm IST


ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా “రాధే శ్యామ్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి దర్శకుడు రాధా కృష్ణ వర్క్ చేస్తుండగా ప్రస్తుతం ఫైనల్ షూట్ లో బిజీగా ఉంది. అయితే నిజానికి ఈ సినిమా వచ్చే మూడు రోజులు అంటే జూలై 30 నే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మళ్ళీ కరోనా రెండో వేవ్ మూలాన వాయిదా పడాల్సి వచ్చింది.

దీనితో ఎలాగో ఈ సినిమా వాయిదా కన్ఫర్మ్ అయ్యింది కానీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. మరి దానిపైనే మేకర్స్ ఒక కన్ఫర్మేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. రానున్న కొన్ని రోజుల్లోనే ఒక అధికారిక పోస్టర్ తో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కానీ ఈ ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :