చరణ్ తో సినిమాకు శంకర్ కు భారీ రెమ్యునరేషన్.?

Published on Apr 16, 2021 7:03 am IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలు సెట్ చేసుకున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు శంకర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల తో మన టాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ చిత్రం కూడా ఒకటి. ముగ్గురు కెరీర్ లోని బెంచ్ మార్క్ సినిమా అయిన దీనిపై అనేక రూమర్స్ ఆల్రెడీ ఉన్నాయి.

మరి అలా ఇప్పుడు శంకర్ రెమ్యునరేషన్ కు సంబంధించి బజ్ బయటకు వచ్చింది. కరెక్ట్ ఫిగర్ ఏమో కాని ఈ చిత్రానికి మాత్రం శంకర్ తన గత చిత్రాల్లో దేనికీ తీసుకోని స్థాయి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని నయా గాసిప్.. మరి దానిని బట్టి ఈ సినిమా ఏ లెవెల్లో ఉండనుందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం ఈ ఏడాదే సెట్స్ మీదకు వెళ్లనున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :