తారక్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఎంతో దూరంలో లేదు

Published on Mar 16, 2021 4:37 pm IST

ఇటీవలే ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాతి చిత్రాన్ని ఎన్టీఆర్ చేయాలని ఛాన్నాళ్ల క్రితమే అనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా మరియు ఎన్టీఆర్ రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో బిజీగా ఉండటంతో వీరి ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఇప్పుడు జక్కన్న సినిమా ఒక కొలిక్కి వస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ ఆ సినిమా షూటింగ్ పూర్తిచేయనున్నారు. అందుకే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది.

ఏప్రిల్ 13వ తేదీ ఉగాది పర్వదినం రోజున వీరి చిత్రం లాంచ్ కానుందట. ఇప్పటికైతే ప్రీప్రొడక్షన్ మొదలుపెట్టి ఒక్కసారి తారక్ ఫ్రీ అవ్వగానే చిత్రీకరణకు వెళ్ళిపోవాలనేది త్రివిక్రమ్ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని హారికా హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్రివిక్రమ్, తారక్ కాంబోలో ‘అరవింద సమేత’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చి ఉండటంతో ఈ కొత్త సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలని ఆలోచన కూడ ఉంది నిర్మాతల్లో.

సంబంధిత సమాచారం :