లేటెస్ట్ : శర్వానంద్ ఎంగేజ్మెంట్ లో చరణ్, ఉపాసన.!

లేటెస్ట్ : శర్వానంద్ ఎంగేజ్మెంట్ లో చరణ్, ఉపాసన.!

Published on Jan 26, 2023 12:29 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాలెంటెడ్ యంగ్ హీరో లు అలా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో శర్వానంద్ కూడా ఒకడు. మరి శర్వానంద్ అయితే హీరోగా ఇప్పుడు పలు సినిమాలు చేస్తుండగా తన నుంచి ఓ ఊహించని గుడ్ న్యూస్ అయితే తన నుంచి బయటకి రావడం ఆసక్తిగా మారింది. మరి తాను అయితే తాజాగా ఎంగేజ్మెంట్ ని ఈరోజు హైదరాబాద్ లో కుటుంబీకులు మరియు స్నేహితుల సమక్షంలో జరుపుకున్నాడు.

మరి తాను రక్షిత రెడ్డి అనే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని పెళ్లి చేసుకోనుండగా వీరి జంటకి బెస్ట్ విషెష్ తెలియజేస్తూ మన టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ లో ఒకరైన రామ్ చరణ్ మరియు ఉపాసన లు కూడా వెళ్లి కలిసి తెలియజేసారు. దీనితో శర్వా యువ జంటతో వీరు కూడా కనిపించిన బ్యూటిఫుల్ స్నాప్ వైరల్ గా మారింది. మొత్తానికి అయితే ఈ యంగ్ హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కి ఈ కొత్త ఏడాది లో ఓ శుభవార్తని అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు