బాలయ్య తో ఎన్టీఆర్ కాదట ఆ హీరోనట.

Published on Mar 27, 2020 3:00 am IST

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోసియుమ్’ సినిమాను తెలుగు మరియు తమిళ భాషల్లో రీమేక్ చేయబోతున్నారట. ఈ సినిమా రీమేక్ హక్కుల్ని సూర్య దేవర నాగవంశీ సొంతం చేసుకున్నారని సమాచారం. మలయాళంలో పృథ్వీరాజ్, బిజూ మీనన్ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం తెలుగు రీమేక్ లో బాలయ్య, ఎన్టీఆర్ కలిసి నటించే అవకాశాలున్నట్లు టాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఐతే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బదులు మరో హీరో పేరు కూడా వినిపిస్తుంది.

ఈ చిత్రంలో బాలయ్య తో పాటు మంచు విష్ణుని నటింప చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. దీని గురించి బాలయ్య మరియు విష్ణులను సంప్రదించాలని అనుకుంటున్నారట. ఈ మూవీని ఎలాగైనా నిర్మించాలని కృత నిశ్చయంతో ఉన్న నాగ వంశీ బలమైన క్యాస్ట్ కోసం చూస్తున్నారట. ఇక గతంలో ఊకొడతారా ఉలిక్కిపడతారో సినిమాలో మంచు హీరో మనోజ్ తో కలిసి బాలయ్య నటించడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More