బన్నీ సినిమా విశేషాలు బోలెడు !

Published on May 21, 2019 12:00 am IST

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న చిత్రం యొక్క మద్దతు షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. దీంతో బన్నీ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి రెండు వార్తలు ఫిలిం నగర్లో బాగా హడావుడి చేస్తున్నాయి. అవేమిటంటే ఇందులో సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉంటుందని, బన్నీ సోదరి పాత్రను ప్రముఖ నటి నివేత థామస్ చేయనుందని టాక్.

అలాగే బన్నీకి మొదటి జోడీ పూజా హెగ్డే కాగా రెండవ జోడీగా కేతిక శర్మను తీసుకున్నారని అంటున్నారు. మరి ఈ రెండు వార్తల్లో వాస్తవమెంతుందో నిర్మాతలే చెప్పాలి. హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బన్నీ సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమా స్టార్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

More