ఇంకా మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే కు కేవలం ఒక్కటంటే ఒకరోజు మాత్రమే వ్యవధి ఉన్నా ఈసారి ఫైనల్స్ గెస్ట్ గా ఎవరు వస్తారు అన్నది సస్పెన్సు గానే ఉంది.పైగా మళ్ళీ ఈసారి కూడా మెగాస్టార్ చిరంజీవి వస్తారనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తున్నప్పటికీ ఇంకా మేకర్స్ నుంచి దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో మరింత సస్పెన్సు నెలకొంది. అయితే ఇప్పుడు ఈ ఫైనల్స్ పై మరిన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
లేటెస్ట్ గాసిప్స్ ప్రకారం అయితే ఈసారి ఫినాలే కు గెస్ట్ గా ఈ సీజన్ హోస్ట్ కింగ్ నాగార్జున తనయుడు యువసామ్రాట్ నాగచైతన్య వస్తాడని తెలుస్తుంది. అంతే కాకుండా తాను ఇప్పుడు చేసిన సినిమా “లవ్ స్టోరీ” హీరోయిన్ సాయి పల్లవితో రానున్నట్టుగా టాక్. మరి ఇంకా అలాగే మన తెలుగు టాప్ మోస్ట్ హీరోయిన్స్ తో అదిరిపోయే పెర్ఫామెన్స్ లు కూడా ఈ ఫైనల్స్ ఎపిసోడ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయని కూడా తెలుస్తుంది. మరి ఈసారి ఏం జరగనుందో చూడాలి.


