“RRR” పై మరో లేటెస్ట్ గాసిప్..!

“RRR” పై మరో లేటెస్ట్ గాసిప్..!

Published on Nov 25, 2020 12:04 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. దేశ వ్యాప్తంగా ఎన్నో అంచనాలను నెలకొల్పుకున్న ఈ పీరియాడిక్ చిత్రం ఇపుడు అంతిమ దశలోకి చేరుకుంది.

అయితే ఇదే క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర వార్తలే వినిపిస్తున్నాయి. అలా వాటిలో లేటెస్ట్ గా వచ్చిందే ఈ చిత్రానికి హిందీ వెర్షన్ లో అక్కడి స్టార్ హీరో ఆమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారని. ఇపుడు ఇదే క్రమంలో మరిన్ని గాసిప్స్ వెల్లువెత్తున్నాయి. హిందీలో లానే ఇతర భాషల్లో కూడా జక్కన స్టార్ హీరోలతో ఆ వెర్షన్ లలో చేస్తారని టాక్ వస్తుంది.

అలాగే తెలుగు వెర్షన్ కు గాను మెగాస్టార్ చిరంజీవి గాత్రం ఇస్తారని గాసిప్స్ మొదలయ్యిపోయాయి. అయితే ఇది అమీర్ వాయిస్ ఓవర్ ఇస్తారని వచ్చిన వార్తలతో అనుబంధంగా వచ్చిన గాసిప్స్ తప్ప అందులో ఇంకా ఏ నిజం లేనట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు