గాసిప్..అప్పుడు అనుకున్న డేట్ కి “RRR” వస్తుందా.?

Published on Aug 14, 2021 10:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం పాన్ ఇండియన్ లెవెల్లో భారీ అంచనాలు నెలకొల్పుకుంది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ దేశంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై గత కొన్ని రోజులు నుంచి ఊహించని విధంగా గాసిప్స్ వినిపించడం మొదలయ్యాయి.

ఈ సినిమాకి ఉన్న సమయం ప్రకారం వాలారు చెబుతున్న అక్టోబర్ 13కి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే ఈ చిత్రం రిలీజ్ వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యిందని మరో టాక్ కూడా స్ప్రెడ్ అవుతుంది. అయితే తాజా టాక్ ఏమిటంటే గతసారి వాయిదా పడ్డ ఈ చిత్రం జనవరి 8 న ఈ ఏడాది రిలీజ్ చెయ్యాల్సి ఉంది. కానీ అది అక్టోబర్ కి షిఫ్ట్ అయ్యింది..

మరి కొత్త రిలీజ్ డేట్ అదే జనవరి 8 న కాకపోతే వచ్చే ఏడాదిలో రిలీజ్ అవుతుంది అని నయా గాసిప్ వైరల్ అవుతుంది. మరి వీటన్నిటికీ తెరపడే తరుణం ఎప్పుడు వస్తుందో అన్నది చాలా ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :