“RRR” ట్రైలర్ పై లేటెస్ట్ గాసిప్ నిజమేనా.?

“RRR” ట్రైలర్ పై లేటెస్ట్ గాసిప్ నిజమేనా.?

Published on Nov 28, 2020 3:01 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా కూడా తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇప్పటికే అల్లూరిగా చరణ్ పై టీజర్ అలాగే కొమరం భీం గా తారక్ పై టీజర్ తో సెన్సేషన్ ను నమోదు చేసారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ చిత్రంపై పలు రకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. అదే ఈ చిత్రం తాలుకా హిందీ వెర్షన్ కు గాను బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇస్తారని టాక్ వచ్చింది.

అయితే ఇప్పుడు ఇదే అంశంపై మరోసారి గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రం తాలూకా ట్రైలర్ కు కూడా అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఉంటుంది అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అలాగే అన్ని వెర్షన్స్ కు కూడా ఆయా భాషల్లో స్టార్ నటుల చేత వాయిస్ ఓవర్ ఉంటుంది అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు