లేటెస్ట్..తారకరత్న పై బయటకొచ్చిన హెల్త్ బులెటిన్.!

Published on Jan 28, 2023 3:08 pm IST

టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి తారక రత్న రీసెంట్ గానే తమ కుటుంబం నుంచి ఉన్న రాజకీయ పార్టీ తెలుగు దేశం లో ప్రత్యక్ష రాజకీయాల్లో దిగారు. దీనితో అక్కడ నుంచి పార్టీ కోసం నిరంతరం తాను శ్రమిస్తూ ఉండగా తాజాగా ఆ పార్టీ యువ అధ్యక్షుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం మహా పాదయాత్రలో తాను పాల్గొన్నారు. అయితే ఇందులో తనకి అనుకోని రీతిలో చేదు వాతావరణం ఎదురైంది.

అభిమానుల తాకిడితో తాను ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోవడం వెంటనే స్థానిక ఆసుపత్రికి అక్కడ నుంచి బెంగళూర్ హృదయ ఆసుపత్రికి చేర్చడం జరిగాయి. మరి తన ఆరోగ్యంపై అయితే అక్కడి ఆసుపత్రి వారు లేటెస్ట్ గా ఓ హెల్త్ బులిటెన్ ని అయితే రిలీజ్ చేశారు.

తారక రత్న ని ఈరోజు తెల్లవారు 1 గంటకి తమ దగ్గర అడ్మిట్ చేసుకోగా ఇప్పటికి తన పరిస్థితి క్రిటికల్ గానే ఉందని హృదయానికి సంబంధించి తమ దగ్గర ఉన్న పలువురు వైద్యులు తన పరిస్థితి నిలకడ చేసేందుకే తీవ్రంగా శ్రమిస్తున్నామని మరికొన్ని రోజులు ఈ చిత్ర కొనసాగే అవకాశం ఉందని వారు క్లారిటా ఇచ్చారు.

సంబంధిత సమాచారం :