మొదలైన “ఆచార్య” షూట్..మరింత ఇన్ఫో.!

Published on Jul 7, 2021 8:00 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. మరి అలాగే ఈ చిత్రంలో మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.

అయితే ఈ చిత్రం మిగిలి ఉన్న షూట్ ఈరోజే స్టార్ట్ అయ్యినట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం తెలుస్తుంది. ఈ షూట్ లో ఒక్క చిరు, కాజల్ మాత్రమే కాకుండా చరణ్ కూడా నటిస్తున్నాడట. చరణ్ అయితే మొత్తం వారం పాటు షూట్ లో పాల్గొననున్నాడట.

అలాగే చరణ్ ఈ షూట్ లోనే ఒక సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ సహా పలు కీలక సన్నివేశాలు చేయనున్నాడట. మరి పూజా కూడా పాల్గొంటుంది అని టాక్. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటెర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :