ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ చిత్రం “అఖండ”. నందమూరి అభిమానుల్లోనే కాకుండా మాస్ వీక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందా అని అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై గత కొన్ని రోజులు నుంచి బజ్ వినిపిస్తుండగా లేటెస్ట్ సమాచారం ఒకటి తెలుస్తుంది.
దాని ప్రకారం ఈ సినిమా అవైటెడ్ ఫస్ట్ సింగిల్ బహుశా ఆగష్టు రెండో వారంలో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది. అయితే థమన్ ఇస్తున్న ఆల్బమ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి అఖండ నుంచి ఆ బ్లాస్టింగ్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. శ్రీకాంత్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.