లేటెస్ట్..వెంకీ మామ “నారప్ప” రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Jul 6, 2021 8:00 am IST

అందరి హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రియమణి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా చిత్రం “నారప్ప”. కోలీవుడ్ హిట్ చిత్రం అసురన్ కి రీమేక్ గా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించారు. అయితే ఎప్పుడో షూట్ కంప్లీట్ చేసుకొని విడుదలకి రెడీ అయ్యిన ఈ చిత్రం మళ్ళీ లాక్ డౌన్ మూలాన వాయిదా పడింది.

దీనితో మేకర్స్ కూడా ఈ చిత్రాన్ని పరిస్థితులు సర్దుమణిగాక సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే మరి ఈ గ్యాప్ లోనే ఈ చిత్రం థియేట్రికల్ గా కాదు నేరుగా ఓటిటి విడుదల అవుతుంది టాక్ మొదలయింది. అలాగే అది కన్ఫర్మ్ అనే టాక్ కూడా ఊపందుకోవడంతో వెంకీ మామ అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. అందుకే ఈ చిత్రం థియేట్రికల్ గానే కావాలి అని డిమాండ్ చేశారు.

అయితే మరి ఇప్పుడు వారికి ఇది గుడ్ న్యూస్ లాగే అనిపిస్తుంది. లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం మేకర్స్ “నారప్ప” ని మొదట థియేట్రికల్ రిలీజ్ నే చెయ్యాలి అనే పునరాలోచనలో ఉన్నారట. ఎలాగో ఈ సినిమాపై మంచి హైప్ ఉంది థియేట్రికల్ రన్ కూడా బానే ఉండొచ్చు అలా విడుదల అయినా పర్వాలేదని చెప్పాలి. మరి ఇది వరకే నాగ్ “వైల్డ్ డాగ్” కూడా లాస్ట్ మినిట్ లో ఓటిటి డీల్ వదిలే థియేటర్స్ లోకి వచ్చింది. మరి వెంకీ మామ కూడా మనసు మార్చుకున్నారో లేదో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :