మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా పెద్ది. చాలా కాలంగా తెలుగు సినిమా ఎదురు చూస్తున్న హిట్ గా నిలిచింది. తెలుగు స్టేట్స్ లో భారీ వసూళ్లు రాబడుతూ పెద్ది మేనియా ఇప్పుడు కొనసాగిస్తుండగా ఈ సినిమా తాలూకా ఓటీటీ వెర్షన్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తోంది.
దీని ప్రకారం పెద్ది ఓటీటీలో మాత్రం థియేట్రికల్ వెర్షన్ కాకుండా పూర్తిగా అన్ కట్ వెర్షన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. డిలీట్ చేసిన అన్ని కీలక సన్నివేశాలు ఇందులో యాడ్ చేస్తారట. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సో ఓటీటీలో పెద్ది నుంచి గట్టి ట్రీట్ నే ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించగా వృద్ది సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.


