చిరు – అనీల్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ రూమర్ ఎంతవరకు నిజం!?

చిరు – అనీల్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ రూమర్ ఎంతవరకు నిజం!?

Published on Mar 7, 2025 2:40 PM IST

Chiranjeevi AnilRavipudi1

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా “విశ్వంభర” అనే భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత చిరు సాలిడ్ లైనప్ ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ లైనప్ లో దర్శకుడు అనీల్ రావిపూడితో ఒక సాలిడ్ ఎంటర్టైనర్ ని కూడా ప్లాన్ చేయగా దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాని కూడా అనీల్ తన మార్క్ స్పీడ్ తో కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ ఈ సినిమాపై వైరల్ గా మారింది. మెగాస్టార్ ఈ సినిమాకి 90 రోజులు కాల్షీట్స్ ఇచ్చేసారు అని త్వరలోనే సినిమా మొదలు కానుంది అని తెలుస్తుంది.

అయితే ఇందులో నిజం లేదని ఇపుడు తెలుస్తుంది. ప్రస్తుతం అనీల్ ఈ సినిమా స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పనిలోనే ఉన్నారట. అలాగే చిరు కూడా విశ్వంభర కంప్లీట్ చేసే పనుల్లో బిజీగా ఉండగా ఆ తర్వాత అనీల్ సినిమాపై దృష్టి పెట్టనున్నారట. కేవలం 90 రోజులే ఇచ్చారు అనే దానిలో నిజం లేదని తెలుస్తుంది. అంతకంటే తక్కువ సమయంలో చిరు ముగించినా ఎలాంటి ఆశ్చర్యం లేదు.

తాజా వార్తలు