లేటెస్ట్ : ఆడియన్స్ లో పీక్స్ లో ‘లైగర్’ మ్యానియా …. !

Published on Aug 11, 2022 2:00 am IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తొలిసారిగా విజయ్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో దీనిపై అటు విజయ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో విజయ్ తల్లిగా రమ్యకృష్ణ నటిస్తుండగా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు. అందరిలో ప్రారంభం నుండి భారీ అంచనాలు కలిగిన లైగర్ నుండి ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ అన్ని కూడా మూవీ పై క్రేజ్ మరింతగా పెంచేసాయి.

మరోవైపు పలు భాషల్లో ఇండియా వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ మూవీని అందరికీ మరింత చేరువ చేసేందుకు లైగర్ టీమ్ ఫ్యాన్డం టూర్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక లైగర్ టీమ్ కి వెళ్లిన ప్రతి చోట నుండి ఫ్యాన్స్, ఆడియన్స్ యొక్క ఆదరణ విపరీతంగా లభిస్తోంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ కి యువత తో పాటు అమ్మాయిల్లో కూడా బాగా క్రేజ్ ఉండడం కూడా లైగర్ పై ఇంతటి భారీ స్థాయి హైప్ కి ఒక కారణం అంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా అందరిలో భారీ హైప్ ఏర్పరిచిన లైగర్ ఆగష్టు 25న గ్రాండ్ లెవెల్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :