మహేష్, రాజమౌళి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఆ తరహాలో ఉంటుందట.!

Published on Jul 6, 2021 9:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళిల నుంచి ఎప్పుడు నుంచో రావాలి అనుకుంటున్న సెన్సేషనల్ కాంబో ఎట్టకేలకు ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో వీరి కాంబో నుంచి సినిమా పడాల్సి ఉంది. కానీ కాస్త లేట్ అయినా కూడా వీరి కాంబో ఇంపాక్ట్ భారీ స్థాయిలో పెరిగిన తర్వాతే వస్తుండడం మరో బిగ్గెస్ట్ యాస్పెక్ట్ అయ్యింది.

అయితే మరి ఈ సినిమా ఏ తరహాలో ఉంటుంది అన్న దానిపై ఎప్పటి నుంచో ఇంట్రెస్టింగ్ చర్చ వస్తూనే ఉంది. రాజమౌళి ఏ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు అన్న దానికి ఇప్పుడు సమాధానం దొరికింది. రచయిత మరియు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ వర్గాలకు ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ సినిమా లైన్ హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజ్ “ఇండియానా జోన్స్” తరహాలో ఉంటుంది అని తెలిపారు.

ఇది మహేష్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే జానర్ లానే ఉందని చెప్పాలి. ఇండియానా జోన్స్ సినిమాలు చూసిన వారికి అయితే మహేష్ ఆ తర్వాత సినిమాలకు పర్ఫెక్ట్ గా సెట్టవుతాడు అని అర్ధం అవుతుంది.. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :