టాలీవుడ్ ని ఇంకా మత్తు నీడలు వీడలేదంట…!

Published on May 15, 2019 10:01 pm IST

2017 లో డ్రగ్స్ కేసు టాలీవుడ్లో కలకలం రేపింది. డ్రగ్స్ దందా కి పాల్పడుతున్న కొందరు వ్యక్తులను విచారించగా టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలు నటులతో పాటు ప్రముఖ దర్శకులకు సంబంధాలున్నాయని తెలియడంతో అప్పట్లో ఈ కేసు పెనుసంచలనంగా మారింది. రవితేజ, ఛార్మి, పూరి . తనీష్ , సుబ్బరాజు, ,మొమైత్ ఖాన్, తరుణ్ ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం 12మంది సినీ ప్రముఖులకు సంబంధాలున్నట్లు తేలింది. ఈ కేసు విచారణ చేపట్టిన అకున్ సబర్వాల్ నేతృత్వంలోని అధికారుల బృదం విడివిడిగా వీరిన విచారించడం జరిగింది. వీరి రక్తం , వెంట్రుకలు వంటివి నమూనాలుగా సేకరించి విచారణ జరిపారు. ఐతే తరువాత ఆ కేసు గురించి ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో ప్రముఖుల ప్రోద్బలంతో కేసు మూసేసాడు అనుకున్నారంతా.

హఠాత్తుగా నిన్న కొన్ని మీడియా ఛానెళ్లలో వీళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చారని… కేసు మూసివేయడం జరిగిందని వార్తలు రావడంతో మరలా ఈ కేసు టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఐతే దీనికి వివరణగా అధికారులు ఈ కేసులు ఉన్న ఎవరికీ మేము కిన్ చిట్ ఇవ్వలేదని, ఇంకా ఆధారాల సేకరణ జరుగుతుందని, దొరికిన ఆధారాలు ఛార్జ్ షీట్లో పొందుపరచి కోర్ట్ కి సమర్పిస్తున్నామన్నారు.

సంబంధిత సమాచారం :

More