అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా జూన్ 26న రిలీజ్ కాబోతుంది. అఖిల్ హోప్స్ అన్ని ఈ సినిమా పైనే ఉన్నాయి. అందుకే, ప్రమోషన్స్ ను కూడా బలంగా చేయడానికి టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే, ఈ సినిమా ఫస్ట్ కాపీ బిఫోర్ వెర్షన్ ను నాగార్జునతో పాటు టీమ్ మెంబర్స్ కూడా చూశారు. అఖిల్ కెరీర్ కి కచ్చితంగా ఈ సినిమా హెల్ప్ అవుతుందని.. ముఖ్యంగా సరికొత్త అఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ప్రధానంగా సినిమాలో క్లైమాక్స్ అదిరిపోయిందని.. క్లైమాక్స్ లో అఖిల్ నటన కూడా అద్భుతంగా ఉందని అంటున్నారు.
కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి.


