బాలయ్య ‘అఖండ 2’ పై క్రేజీ బజ్

Akhanda 4

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. అఖండ లో శివుడ్ని, శివ భక్తితో పాటు బాలయ్య నట విశ్వరూపాన్ని చూపించి అఖండ విజయాన్ని నమోదు చేశాడు. అందుకే, ఈ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా ‘అఖండ 2’ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? వంటి అంశాల పై కొన్ని అప్ డేట్స్ వినిపిస్తున్నాయి. ఆగస్టులో సినిమాని స్టార్ట్ చేసి.. వచ్చే ఏడాది ఎలక్షన్ టైంకి నెల ముందుగా సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథ పై ఓ ఆసక్తికరమైన గాసిప్ వినిపిస్తోంది.

ఓ స్వార్థ పరుడి చేతిలో పడి నాశనం అవుతున్న ప్రజలను, ముఖ్యంగా తిరుమలేశుని ప్రతిష్టను తగ్గించే కార్యక్రమాలు చేసే వ్యక్తులను హీరో ఎలా అంతం చేశాడు ?. అలాగే ఇతర మతస్తుడు నాయకుడు కావడం కారణంగా దేవాలయాల పై ఎలాంటి దాడులు జరుగుతాయి?, వాటిని అరికట్టాలి అంటే.. ఏం చేయాలి? లాంటి అంశాలను కూడా అఖండ 2 లో చూపించబోతున్నారు. మొత్తానికి అఖండ 2 లో పొలిటికల్ అంశాలే మెయిన్ హైలైట్ గా ఉండబోతున్నాయి. జూన్ 10, 2023న బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని ‘అఖండ 2’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

Exit mobile version