ప్రత్యేక సెట్ లో ‘బాలయ్య’ పై కీలక సన్నివేశాలు !

ప్రత్యేక సెట్ లో ‘బాలయ్య’ పై కీలక సన్నివేశాలు !

Published on Feb 17, 2025 8:01 AM IST

నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో బాలయ్య నటిస్తున్న అఘోర పాత్ర పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సినిమా మొత్తానికే ఈ సన్నివేశాలు మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. పైగా బాలయ్య నటన కూడా ఈ సన్నివేశాల్లో చాలా అద్భుతంగా ఉంటాయట.

కాగా పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను ఈ సినిమాలో తీసుకున్నారట. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. అన్నట్టు మేకర్స్ ఈ ఏడాది సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు