ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా పరిశ్రమ నుండి పలువురికి అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పుష్ప మూవీలో అద్భుత నటన కనబరిచిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. ఇక ఉప్పెన, ఆర్ఆర్ఆర్, పుష్ప కొండపొలం వంటి చిత్రాలకు పలు క్యాటగిరిలో జాతీయ అవార్డులని గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా నేడు ఈ అవార్డుల వేడుక ఢిల్లీలో ఎంతో వైభవోపేతంగా జరిగింది.
నిన్న సాయంత్రమే పలువురు అవార్డు గ్రహీతలు అక్కడికి చేరుకున్నారు. ఇక నేడు జరిగిన ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యకమ్రంలో మన తెలుగు చిత్ర సీమకు చెందిన విజేతలు పలువురు కలిసి దిగిన పిక్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్, హీరో అల్లు అర్జున్, ప్రేమ్ రక్షిత్, చంద్రబోస్, బుచ్చిబాబు సన దేవిశ్రీప్రసాద్ వంటి వారిని చూడవచ్చు. మొత్తంగా ఎంతో గ్రాండ్ గా జరిగిన ఈ కార్యకమంలో విజేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులని ప్రధానం చేసారు.
