ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నిర్విరామంగా పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాల్లో మాత్రమే కాకుండా తాను అతిధి పాత్రలో కూడా కనిపించేందుకు ఓకే చేసిన చిత్రమే “కన్నప్ప”. మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్ నడుమ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నాడు అని ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు.
అయితే ఫైనల్ గా ఇపుడు అఫీషియల్ అప్డేట్ బయట వచ్చేసింది. ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ తో స్వయంగా మంచు విష్ణు అప్డేట్ అందించాడు. దీనితో ప్రభాస్ కి ఏ తరహా కాస్ట్యూమ్ ఉంటుంది అనేది కొంచెం ఇందులో అర్ధం అవుతుంది. పాదరక్షలు, చిరుత చర్మంతో కూడిన దుస్తులు కనిపిస్తున్నాయి. మరి ఇందులో ప్రభాస్ నందీశ్వరుడుగా కనిపిస్తాడు అని కొన్ని రూమర్స్ ఉన్నాయి.
మరి ఇది ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి. ఇక ఈ భారీ చిత్రంలో అక్షయ్ కుమార్ (Akshay Kumar), శివ రాజ్ కుమార్ మోహన్ లాల్ లాంటి దిగ్గజాలు కూడా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు అలాగే మంచు మోహన్ బాబు ఈ సినిమాని నిర్మాణం వహిస్తుండగా పాన్ వరల్డ్ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
My brother joined the shoot #Prabhas#kannappa???? pic.twitter.com/WW8WQbBLec
— Vishnu Manchu (@iVishnuManchu) May 9, 2024