మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి చేస్తున్న మహా యాగం “రౌద్రం రణం రుధిరం” సినిమా. ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పై తారా స్థాయి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఎన్నో రకాల పరిస్థితులు చోటు చేసుకోవడంతో షూటింగ్ చాలా వాయిదా పడాల్సి వచ్చింది.
ఇక ఎలాగో ఈ కరోనా కష్ట కాలంలోనే షూటింగ్స్ జరపడం స్టార్ట్ చెయ్యడంతో జక్కన్న కూడా రంగం సిద్ధం చేసారు. అయితే అది ఇంకా లేట్ కావడం రావాల్సిన అప్డేట్స్ కూడా పెండింగ్ ఉండిపోవడంతో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇదిలా ఉండగా తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం RRR యూనిట్ అంతా షూట్ ను మొదలు పెట్టే ముందు ఖచ్చితంగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని ప్లాన్ గీసుకున్నట్టు తెలుస్తుంది.
ఆ తర్వాతనే షూట్ ను మొదలు పెట్టి అన్ని పనులను పూర్తి చెయ్యాలని భావిస్తున్నారట. అందులో భాగంగా షూట్ కు సంబంధించిన సరంజామా అంతటిని కూడా శానిటైజ్ చేసి మొదలు పెట్టనున్నారని సమాచారం. దాదాపు 400 కోట్లతో డివివి దానయ్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విషయంలో ఏం జరగనుందో చూడాలి.


