‘పుష్ప 2’లో ఆ సీక్వెన్సే హైలైట్ ?

Pushpa2 m

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న పుష్ప-2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో బన్నీ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే హైలైట్ గా ఉంటుందట. ఇక ఈ క్రమంలో ‘పుష్ప 2’ ఐటమ్ సాంగ్ పై ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. హీరోయిన్ ఊర్వశి రౌటేలా చేత ఈ ఐటమ్ సాంగ్ చేయించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట.

సమంత సాంగ్ కంటే కూడా.. ఊర్వశి పై సాంగ్ అదిరిపోతుంది అని టాక్ నడుస్తోంది. మరి ఐటమ్ సాంగ్ కి ఊర్వశి ఒప్పుకుంటుందా? చూడాలి. మొత్తానికి పుష్ప 2 సినిమాని సుకుమార్ వెరీ ఇంట్రెస్ట్ గా ప్లాన్ చేశాడు. పైగా ఈ పుష్ప సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప 2లో పరిచయం కానున్నాయి. అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Exit mobile version