లేటెస్ట్..ఓటిటిలో వచ్చేసిన “సర్కారు వారి పాట”..కానీ..!

Published on Jun 2, 2022 3:00 pm IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ అండ్ సోషల్ డ్రామా “సర్కారు వారి పాట” కోసం తెలిసిందే. భారీ అంచనాలు నడుమ మహేష్ కెరీర్ లో మంచి మోస్ట్ అవైటెడ్ గా వచ్చిన ఈ చిత్రం రికార్డు వసూళ్లతో అదరగొట్టింది.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా ఇంకా థియేటర్స్ రన్ కొనసాగుతుంది, తాజాగా మురారి వా సాంగ్ కూడా యాడ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసినట్టు కనిపిస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేసిన స్ట్రీమింగ్ యాప్ అమేజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా కనిపిస్తుంది.

కానీ ఈ సినిమా ఫ్రీ గా చూడ్డానికి కుదరదు. కేవలం రెంట్ రూపేణా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. దీనితో ఈ అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :